19, మే 2015, మంగళవారం

అలసత్వం లేదా బద్ధకం

 అనగనగ ఒక అడివిలో ఒక ఒంటె వుండేది  రోజు ఆహారం కోసం చాల దూరం తిరిగి తిరిగి బాగా అలసి పొయెది. ఇంత కష్టపడకుండా ఆహారం ఎలా సంపాదించాల అని. వెంటనే ఒక ఆలోచన వచ్చిన్ది. అదే తడవుగా బ్రహ్మ గురించి గాధ మైన తపస్సు చేసింది. కొన్ని సంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మ దర్శనం ఇచ్చాడు. తన కోరిక తెలియ చేసింది బ్రహ్మకు. తనకు ఆహారం ఎంత దూరంలో వుంటే అంత దూరం తన మెడ సాగాలి అని కొరుకున్ది. తపస్సు మెచ్చి బ్రహ్మ కోరిన వరం ఇచ్చి అదృశ్యం అయాడు.
అప్పటి నుంచి ఒంటె తను కదల వలసిన అవసరం లేకుండానే ఆహారం సంపాదన మొదలు పెట్టినది.
ఇప్పుడు తన మెడ మొయ్య లేక బాధ పడుతుంది కదా ?
అందుకే మనిషికి అసలు బద్ధకం పనికిరాదు . మనిషి ఎప్పుడుకూడా కష్టపడుతూనే ఉంటాడు . వుండాలి కూడా
బద్దకస్తుడికి విరేచనం కూడా అవ్వదు. అంటే అతిశయోక్తి కాదు
రోజు తన గురించి తెలుసుకుంటూ వుండాలి
జ్ఞాన సముపార్జున అప్పుడే జరుగుతుంది 

22, ఫిబ్రవరి 2015, ఆదివారం

చదువుకు ముందు కాకర చదువు కున్నాక కీకర

చిన్నప్పుడు పిల్లలు ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తరు. అందుకే పెద్దలు గుడికి , ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి తీసుకుని వెళుతూ వుంటారు  దాంతో కొంత వరకు పిల్లలికి వీటి మీద కొంత ఇష్టం కలుగుతూ వుంటుంది. 
అందుకే పిల్లలు ముందు నుంచి భారత రామాయణములు చదవాలి లేదా చదివించాలి . అపుడే వారికీ జీవితం గురించి బాగా తెలుస్తుంది.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి చదువు పూర్తయ్యే సరికి తెలివి ఎక్కువ అయింది అనుకొని భక్తి మీద నుంచి ప్రక్కకు జరుగుతారు . జీవితం అంటే ఏమిటో ఎందుకో తెలియదు.
ధర్మర్ధకమమోక్షములు సంపాదించడమే జీవిత లక్ష్యం అని తెలుసుకోవాలి . కానీ చాలామంది అర్థ కామ ములు కోసం మాత్రమే కర్మ చేస్తూ వుంటారు . ఈ పురుషర్ధమాలను సాధించటమే జీవిత లక్ష్యం గా కొందరు కర్మ చెస్తున్తరు. కానీ ధర్మముతో కూడిన అర్థ కామములను సంపాదించ దానికి ప్రయత్నం చాల మంచిది. దాని వల్ల మోక్ష సాధన జరుగుతుంది
ఈ విషయం ఈనాటి పిల్లలకి ఎలా చెప్పాలి అనేదే సమస్య.

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

యక్ష ప్రశ్నలు

చాల మంది యక్ష ప్రశ్నలు చదివే ఉండవచ్చు. కానీ నాకు నచ్చినవి వ్రాద్దామని మొదలు పెట్టాను .
1. భగవంతుడు ఇచ్చిన స్నెహి తులు ఎవరు - భార్య
    స్నేహితులకు ఉండవలసిన లక్షణములు - తప్పు చేయకుండా నివారించాలి
                                                               - మంచి చేయడానికి ప్రోత్సహించాలి
                                                                - చెడు వుంటే విడిగా చెప్పాలి
                                                                - మంచి వుంటే అందరికి చెప్పాలి
   ఇటువండి లక్షణాలు వుంటాయి కనుక భార్య మంచి  స్నేహితురాలు. అలాగని భార్యకు మాత్రమే ఈ లక్షణాలు వుండాలి కాదు . ఇద్దరికీ ఈ లక్షణాలు వుండాలి . ఆప్పుడు  వారి స్నేహం దిన దిన ప్రవర్ధమానమై మంచి దంపత్యంగా కొనసాగుతుంది .

20, జనవరి 2015, మంగళవారం

ఈరోజు ఇంకా కొన్ని కబుర్లు చెప్పు  కుందాము .
ఒక కోడలు ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి మల్లి  నిద్ర పొయెది. ఇది చూసిన మామగారు ఒక రాజు కోడలును పిలిచి ఈ విషయం మీద చర్చ జరిపేరు .
దాంతో ఆ కోడలు ఉదయం లేవడమే మనెసిన్ది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మామగారు మళ్ళి కోడలును మాట్లాడించి విషయం అదిగెరు.
అవును మీరు వద్దన్నారు కదా అనే సరికి మామగారికి కోపం వచ్చింది
నేను వడ్డన లేదు అమ్మ , దీపం పెట్టుకుని మళ్ళి నిద్ర పోవద్దు అన్నాను అని చెప్పారు
మరి నేను ప్రొద్దున్నే లేస్రే మీ అబ్బాయి దున్నపోతులగా నిద్రపోతున్నాడు .
ఆయన్ను కూడా లెమ్మని చెప్పండి అప్పుడు నేను మళ్ళి నిద్రపోను అంది కోడలు
సరే నమ్మ ప్రయత్నిస్తాను
ఒకసారి ఆలోచించాడు  మామగారు
ఇంట్లో ముందుగ ఎవరు లేవాలి . చాల సేపటికి ఆలోచన తేలింది . అందరు తొందరగా లెవలి. ఒక్క కోడలు మాత్రమే లేస్తే ఎలా అని
ఒరే అబ్బయి నువ్వు కూడా తొందరగా లేస్తే బాగుంటుంది కద. ఇంచక్కా ఇద్దరు ఒక అరగంట ఆరుబయట వాకింగ్ వెళ్లి వచ్చి చక్కడ స్నానం చేసి దేవుడికి దీపక్ పెట్టార బాబు ,
అంటే మరునాడు అబ్బాయి బస్సు టికెట్స్ తెచ్చాడు . మీరు వెంటనే బయలు దేరండి పెదనాన్న గారు   రాత్రి ఫోన్ చేసారు అని .

18, జనవరి 2015, ఆదివారం

AMERICALO SANKRANTI

అమెరికా లో  సంక్రాంతి
అమెరికా లో సంక్రాంతి గురించి వ్రాద్దామని మొదలు పెట్టాను
ఏంతో మంది తెలుగువారు ఒకచోట చేరి సరదాగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు
చిన్న పిల్లలకు భోగి పళ్ళు, ఆడవారికి ముగ్గులు పోటి, మగవాళ్ళకి వంట రుచి చూసే పోటి, సంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో .
కానీ దీనికి కూడా ఏడు డాలర్స్ టికెట్ పెట్టారు  అయినా వెళ్లి చూడాలని పించింది
చిన్న చిన్న పిల్లలు పద్యాలు పాడుతూ , డాన్సులు  చేస్తూ వుంటే చూడ ముచ్చటగా  వుంది
మేము వచ్చాక ఇది మొదటి పండుగ / ఇంకా తెలుగు వారు అమెరికాలో వున్నా తెలుగు బాషను వదల కుండ ఉండడానికి ప్రయత్నం లో లోపం లేకుండా శ్రమిస్తున్నారు .
మనం ఇదే పండుగ వాతావరణం ఆంధ్ర దేశంలో చుస్తే ప్రతి ఇంట కనిపిస్తుంది .

ఉదయాన్నే తలంటూ
ఇంటి ముందు రంగ వల్లులు, భోగి మంటలు, భోగి పళ్ళు, ఆడవారి పేరంటములు , పిండి వంటలు,
విచిత్ర వేష ధారణ, గాలి పటములు, బసవన్నలు, అబ్బో ఎన్ని అని చెప్పడం అన్ని మన దగ్గరనే కనిపిస్తూ వుంటాయి .

అమెరికాలో ఇంటిముందు రంగ వల్లులు వేయ లేము .
గాలి పటములు ఎగుర వేయ  కూడదు
ప్రక్కా వాళ్ళతో పరిచయం తగదు
ఎవరు పెరంటాని కి రారు . ఎందుకు ? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వారి డ్రెస్ చూసి అని ఆందోళన
చాలమంది మంగళ సూత్రాలు, మట్టెలు, నల్లపూసలు అన్ని అటక ఎక్కేసై
చెవులకి తటంకలు లేవు . చీరలు కట్టడం మానేసారు.
టైట్ జీన్స్   టీ షర్టు . పెద్ద వాళ్ళు అని గాని  పిల్లలు అని గాని లెదు. అందరు అవే డ్రెస్సెస్
తలలుకు   ఎప్పుడు తలంటు స్నానం . జుట్టు విరపూసుకు  తిరగడం
 ఇష్టం వుంటే వండు కొదవం లేకుంటే కొనుక్కోవడం
ఇది పండుగ మెరికాలో ఇంటింట  వాతావరణం
మనలాగా ఎవరింటి వెళ్ళడం కానీ పిలవడం కానీ వుండదు
సామూహికమే మంచిది అనిపించే లాగా పండులగున్నై  

13, డిసెంబర్ 2014, శనివారం

ఔపోసన  / అతిధి దేవో భవ 

ఈరోజు నేను మీకు ఇంకొక క్రొత్త విషయం గురించి చెబుతాను. పెద్దవాళ్ళకి భోజనం ఎలా వద్దించాలొ తెలుసుకుందాము 
1. వంట చేసే స్త్రీలు ;ఉదయమే లేచి స్నానం చేసి ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకుని ముందుగ దేముడికి దీపం పెట్టాలి
2. వంట చేసే సమయంలో జుట్టు ముడి వేసుకుని వుండాలి
32. ఆటు పిమ్మట స్టవ్ మీద  రుచులు చూడకుండా వంట చేయాలి. 
5. కనీసం ఒక కుర, పప్పు, పచ్చడి, చారు వండాలి . 
6.  ముక్యంగా ఒక తీపి పదార్దం వుండాలి. 
7.  వంట చేసే సమయంలో జుట్టు ముడి వేసుకుని వుండాలి 
8. ఇంటిలో వున్న పెద్ద వాళ్ళని ఒడుగు అయిన వాళ్ళను  భోజనానికి లేవమని చెప్పాలి  
9 వాకిరి ఆసనం వేసి అరటి ఆకు గాని విస్తరి గాని వేసి వండిన పదార్దాలు 
అన్నింటిని  వడ్డించాలి
10. ముక్యంగా ఒక తీపి ప దార్దం  వుండాలి .పప్పు నెయ్యి కూర చారు ఆపైన పెరుగు వడ్డించాలి
11. పెద్దవారు ఒడుగు అయిన వారు చక్కగా సంధ్య వందనం చేసుకొని భోజనానికి కూర్చోవాలి 
12. వంట చేసిన వారు గాని ఇంటి పెద్ద గాని ఔపోసన వేయాలి. చేతిలో తీర్థం మూడు సార్లు లోపలి పుచ్చుకుని దైవ దైవ ప్రార్ధన చేసి  భోజనానికి ఉపక్రమించాలి . 
13, వారి భోజన సమయం లో పదార్దాలు అన్ని మరి మరి అడిగి వడ్డించాలి . 
14. ఆ సమయం లో వేరే సంభాష న కూదదు . 
15. వారి భోజన పాత్ర ఇంటి ఆవిడ మాత్రమే తీయలి. 
16. భోజనం చేసిన డగ్గర  శుభ్రం అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ తినా లి. 

3, డిసెంబర్ 2014, బుధవారం

నా  గురించి
నా పేరు మైలవరపు కామేశ్వర రావు . మా వూరు రంగంపేట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. మా నాన్నగారి పేరు శ్రీ మైలవరపు వెంకట రావు గారు మా అమ్మ గారి పేరు సూర్య కాంతం. నాకు నలుగురు అన్నతమ్ములు.
నా వృత్తి ఏదైనా నాకు బ్లాగ్స్ వ్రాయడం అంటే చాల ఇష్టం. నేను బాగా మాట్లాడతానని అందరు అంటూ ఉంటారు.
అందుకని ఈ బ్లాగ్ మొదలు పెట్టాను
అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను .
చదవండి ఆనందించండి