19, మే 2015, మంగళవారం

అలసత్వం లేదా బద్ధకం

 అనగనగ ఒక అడివిలో ఒక ఒంటె వుండేది  రోజు ఆహారం కోసం చాల దూరం తిరిగి తిరిగి బాగా అలసి పొయెది. ఇంత కష్టపడకుండా ఆహారం ఎలా సంపాదించాల అని. వెంటనే ఒక ఆలోచన వచ్చిన్ది. అదే తడవుగా బ్రహ్మ గురించి గాధ మైన తపస్సు చేసింది. కొన్ని సంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మ దర్శనం ఇచ్చాడు. తన కోరిక తెలియ చేసింది బ్రహ్మకు. తనకు ఆహారం ఎంత దూరంలో వుంటే అంత దూరం తన మెడ సాగాలి అని కొరుకున్ది. తపస్సు మెచ్చి బ్రహ్మ కోరిన వరం ఇచ్చి అదృశ్యం అయాడు.
అప్పటి నుంచి ఒంటె తను కదల వలసిన అవసరం లేకుండానే ఆహారం సంపాదన మొదలు పెట్టినది.
ఇప్పుడు తన మెడ మొయ్య లేక బాధ పడుతుంది కదా ?
అందుకే మనిషికి అసలు బద్ధకం పనికిరాదు . మనిషి ఎప్పుడుకూడా కష్టపడుతూనే ఉంటాడు . వుండాలి కూడా
బద్దకస్తుడికి విరేచనం కూడా అవ్వదు. అంటే అతిశయోక్తి కాదు
రోజు తన గురించి తెలుసుకుంటూ వుండాలి
జ్ఞాన సముపార్జున అప్పుడే జరుగుతుంది 

1 కామెంట్‌: