18, జనవరి 2015, ఆదివారం

AMERICALO SANKRANTI

అమెరికా లో  సంక్రాంతి
అమెరికా లో సంక్రాంతి గురించి వ్రాద్దామని మొదలు పెట్టాను
ఏంతో మంది తెలుగువారు ఒకచోట చేరి సరదాగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు
చిన్న పిల్లలకు భోగి పళ్ళు, ఆడవారికి ముగ్గులు పోటి, మగవాళ్ళకి వంట రుచి చూసే పోటి, సంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో .
కానీ దీనికి కూడా ఏడు డాలర్స్ టికెట్ పెట్టారు  అయినా వెళ్లి చూడాలని పించింది
చిన్న చిన్న పిల్లలు పద్యాలు పాడుతూ , డాన్సులు  చేస్తూ వుంటే చూడ ముచ్చటగా  వుంది
మేము వచ్చాక ఇది మొదటి పండుగ / ఇంకా తెలుగు వారు అమెరికాలో వున్నా తెలుగు బాషను వదల కుండ ఉండడానికి ప్రయత్నం లో లోపం లేకుండా శ్రమిస్తున్నారు .
మనం ఇదే పండుగ వాతావరణం ఆంధ్ర దేశంలో చుస్తే ప్రతి ఇంట కనిపిస్తుంది .

ఉదయాన్నే తలంటూ
ఇంటి ముందు రంగ వల్లులు, భోగి మంటలు, భోగి పళ్ళు, ఆడవారి పేరంటములు , పిండి వంటలు,
విచిత్ర వేష ధారణ, గాలి పటములు, బసవన్నలు, అబ్బో ఎన్ని అని చెప్పడం అన్ని మన దగ్గరనే కనిపిస్తూ వుంటాయి .

అమెరికాలో ఇంటిముందు రంగ వల్లులు వేయ లేము .
గాలి పటములు ఎగుర వేయ  కూడదు
ప్రక్కా వాళ్ళతో పరిచయం తగదు
ఎవరు పెరంటాని కి రారు . ఎందుకు ? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వారి డ్రెస్ చూసి అని ఆందోళన
చాలమంది మంగళ సూత్రాలు, మట్టెలు, నల్లపూసలు అన్ని అటక ఎక్కేసై
చెవులకి తటంకలు లేవు . చీరలు కట్టడం మానేసారు.
టైట్ జీన్స్   టీ షర్టు . పెద్ద వాళ్ళు అని గాని  పిల్లలు అని గాని లెదు. అందరు అవే డ్రెస్సెస్
తలలుకు   ఎప్పుడు తలంటు స్నానం . జుట్టు విరపూసుకు  తిరగడం
 ఇష్టం వుంటే వండు కొదవం లేకుంటే కొనుక్కోవడం
ఇది పండుగ మెరికాలో ఇంటింట  వాతావరణం
మనలాగా ఎవరింటి వెళ్ళడం కానీ పిలవడం కానీ వుండదు
సామూహికమే మంచిది అనిపించే లాగా పండులగున్నై  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి