22, ఫిబ్రవరి 2015, ఆదివారం

చదువుకు ముందు కాకర చదువు కున్నాక కీకర

చిన్నప్పుడు పిల్లలు ఎక్కడికి రమ్మంటే అక్కడకి వస్తరు. అందుకే పెద్దలు గుడికి , ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి తీసుకుని వెళుతూ వుంటారు  దాంతో కొంత వరకు పిల్లలికి వీటి మీద కొంత ఇష్టం కలుగుతూ వుంటుంది. 
అందుకే పిల్లలు ముందు నుంచి భారత రామాయణములు చదవాలి లేదా చదివించాలి . అపుడే వారికీ జీవితం గురించి బాగా తెలుస్తుంది.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి చదువు పూర్తయ్యే సరికి తెలివి ఎక్కువ అయింది అనుకొని భక్తి మీద నుంచి ప్రక్కకు జరుగుతారు . జీవితం అంటే ఏమిటో ఎందుకో తెలియదు.
ధర్మర్ధకమమోక్షములు సంపాదించడమే జీవిత లక్ష్యం అని తెలుసుకోవాలి . కానీ చాలామంది అర్థ కామ ములు కోసం మాత్రమే కర్మ చేస్తూ వుంటారు . ఈ పురుషర్ధమాలను సాధించటమే జీవిత లక్ష్యం గా కొందరు కర్మ చెస్తున్తరు. కానీ ధర్మముతో కూడిన అర్థ కామములను సంపాదించ దానికి ప్రయత్నం చాల మంచిది. దాని వల్ల మోక్ష సాధన జరుగుతుంది
ఈ విషయం ఈనాటి పిల్లలకి ఎలా చెప్పాలి అనేదే సమస్య.

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

యక్ష ప్రశ్నలు

చాల మంది యక్ష ప్రశ్నలు చదివే ఉండవచ్చు. కానీ నాకు నచ్చినవి వ్రాద్దామని మొదలు పెట్టాను .
1. భగవంతుడు ఇచ్చిన స్నెహి తులు ఎవరు - భార్య
    స్నేహితులకు ఉండవలసిన లక్షణములు - తప్పు చేయకుండా నివారించాలి
                                                               - మంచి చేయడానికి ప్రోత్సహించాలి
                                                                - చెడు వుంటే విడిగా చెప్పాలి
                                                                - మంచి వుంటే అందరికి చెప్పాలి
   ఇటువండి లక్షణాలు వుంటాయి కనుక భార్య మంచి  స్నేహితురాలు. అలాగని భార్యకు మాత్రమే ఈ లక్షణాలు వుండాలి కాదు . ఇద్దరికీ ఈ లక్షణాలు వుండాలి . ఆప్పుడు  వారి స్నేహం దిన దిన ప్రవర్ధమానమై మంచి దంపత్యంగా కొనసాగుతుంది .